BCAS allows piligrims to carry sabarimala irumudi in flights
mictv telugu

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్

November 22, 2022

BCAS allows piligrims to carry sabarimala irumudi in flights

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుభవార్త చెప్పింది. ఇకపై విమానంలో కూడా ఇరుముడి తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. పూర్తిగా తనిఖీ చేశాక ఇరుముడిని విమానంలోకి అనుమతించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20 వరకు ఇరుముడిని విమానాల్లో శబరిమల వెల్లే భక్తులకు ఈ అవకాశాన్ని కల్పించారు. దీంతో అనేక మంది భక్తులకు శబరిమల ప్రయాణం మరింత సులభతరం కానుంది. గతంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానంలో ఇరుముడి తీసుకెళ్లేందుకు ఆంక్షలు విధించారు.

ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ, రెండు కొబ్బరికాయలు, వక్కలు, తమలపాకులు, నాణాలు, పసువు, గంధంపొడి, విభూతి, పన్నీరు, బియ్యం, అటుకులు, మరమరాలు, బెల్లం, కలకండ, అగరువత్తులు, కర్పూరం,మిరియాలు, తేనె, ఎండుద్రాక్ష వంటి దేవునికి సమర్పించే వస్తువులు అన్నీ ముందు భాగంలో ఉంచుతారు. సంచి వెనుక భాగంలో వారి వ్యక్తిగత వస్తువులు, బట్టలు ఉంచి ముడి వేస్తారు. దీక్షాధారులు ఇరుముడిని తలమీద పెట్టుకుని ప్రయాణం చేయవలసి ఉంటుంది.కొన్నిసార్లు అత్యవసర సమయాలు, ప్రయాణాల్లో మాత్రమే ఇరుముడిని పక్కన బెడతారు.

ఇటీవలే శబరిమలలోని అయ్యప్ప దేవాలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 16 నుంచి వచ్చే జనవరి 20 వరకు ఈ దేవాలయం భక్తులకు అందుబాటులో ఉంటుంది. దీంతో భారీ ఎత్తున భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు తరలి వెళ్తున్నారు.