టీం ఇండియాకు ఉగ్రముప్పు! బీసీసీఐ అలర్ట్.. - MicTv.in - Telugu News
mictv telugu

టీం ఇండియాకు ఉగ్రముప్పు! బీసీసీఐ అలర్ట్..

August 19, 2019

Bcci Alert To Team India Security...

టీం ఇండియా ఆటగాళ్లకు ఉగ్రముప్పు పొంచి ఉందనే వార్తలు ఇప్పుడు అందరిని కలవరానికి గురిచేస్తోంది.వెస్టిండీస్‌ టూర్‌లో భారత్ ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు పూర్తి చేయగా టెస్టు మ్యాచ్‌లకు సిద్ధమౌతోంది. రెండు సిరీస్‌లను నెగ్గిన టీం ఇండియా ఇప్పుడు టెస్టు సిరీస్‌పై కన్నేసింది. ఈ సమయంలో ఆదివారం  బీసీసీఐకి ఓ ఈ మెయిల్‌ వచ్చింది. విండీస్ టూర్‌లో ఉన్న ఆటగాళ్లకు ముష్కరుల నుంచి ముప్పు ఉందని అందులో పేర్కొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

మెయిల్‌పై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు అదంతా తప్పు సమాచారమని గుర్తించారు. అయినప్పటికి ఆటగాళ్ల భద్రత కోసం ఆంటిగ్వాలోని భారత హైకమిషన్‌కు విషయాన్ని తెలియజేశారు. దీంతో స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. భారత ఆటగాళ్లకు రక్షణ కల్పించారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. తాజాగా కూలిడ్జ్‌లో టీం ఇండియా ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతోంది. ఈనెల 22 నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభంకానుంది.