Home > Featured > ఒలంపిక్ విజేత నీరజ్ చోప్రా జావెలిన్‌ను భారీ ధరకు కొన్న బీసీసీఐ

ఒలంపిక్ విజేత నీరజ్ చోప్రా జావెలిన్‌ను భారీ ధరకు కొన్న బీసీసీఐ

గతేడాది జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన ఒలంపిక్ పోటీల్లో భారత జావెలిన్ వీరుడు నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో దేశం మొత్తం నీరజ్‌కు అభినందనలు తెలిపింది. ప్రధాని మోదీ ప్రత్యేక చొరవతో నీరజ్‌కు విదేశాల్లో నాణ్యమైన శిక్షణ ఇప్పించారని, అందుకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరించిందని అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఒలంపిక్ ముగిసిన తర్వాత ప్రధానిని కలిసిన నీరజ్ తాను ఉపయోగించిన జావెలిన్లలో ఒకదాన్ని కానుకగా ఇచ్చారు. దీంతో పాటు మోదీకి లభించిన 1,348 వస్తువులకు గతేడాది సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య ఈ వేలం నిర్వహించారు. అప్పుడు మొత్తం 8,600 బిడ్లు దాఖలయ్యాయి. తాజాగా ఆ బిడ్లను తెరవగా, నీరజ్ చోప్రా వాడిన జావెలిన్ అత్యధిక ధర పలికింది. దీనిని 1.5 కోట్లకు భారత క్రికెట్ సంస్థ బీసీసీఐ కొనుగోలు చేసింది. దీని తర్వాత ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవీ ఖడ్గం రూ. 1.25 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే పారా ఒలంపిక్ ఛాంపియన్ సుమీత్ ఆంటిల్‌కు చెందిన జావెలిన్ కోటి రూపాయలు, మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్‌కు చెందిన గ్లోవ్స్‌కు రూ. 91 లక్షల ధర లభించింది.

Updated : 2 Sep 2022 6:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top