ఈసారి ఐపీఎల్‌లో తారల సందడి కష్టమే..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈసారి ఐపీఎల్‌లో తారల సందడి కష్టమే..!

November 7, 2019

 

ipl..............

ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే క్రికెట్ ప్రియులకు పండగే. ఇక బీసీసీఐతో పాటు ప్రాంచైజెస్ కూడా అదే విధంగా కాసులు వెనకేసుకుంటాయి. ఈ మ్యాచ్‌లకు హడావిడి కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఈ ఏడాది జరగబోయే మ్యాచుల్లో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.  ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు లేకుండానే సాధాసీదాగా ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 

ఈ ఓపెనింగ్ ఈ వెంట్ కోసం కోట్లాడి రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని కోసం బాలీవుడ్ తారలు వచ్చి డ్యాన్సులతో సందడి చేస్తుంటారు.  కానీ ఈ సారికానీ క్రికెట్ ప్రేమికుల నుంచి దీనిపై పెద్దగా స్పందన లేదు. కొన్ని గంటల పాటు నిర్వహించే ఈవెంట్‌కు దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. దానికి బదులు ఏదైనా మంచి పనికి వినియోగించాలని నిర్ణయించారు. ప్రారంభోత్సవ వేడుకల ఆలోచన విరమించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది జరిగిన వేడుకలను కూడా బీసీసీఐ రద్దు చేసింది. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇక నుంచి కూడా ఓపెనింగ్ సెర్మనీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు.