BCCI canceled the selection committee
mictv telugu

బీసీసీఐ సంచలన నిర్ణయం..వారిపై వేటు!

November 19, 2022

BCCI canceled the selection committee

టీ20 వరల్డ్ కప్ ఓటమితో బీసీసీఐ ప్రక్షాళన మొదలు పెట్టింది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సహా సెలెక్షన్ కమిటీపై మొదటి వేటు వేసింది. అనూహ్యంగా కమిటీని రద్దు చేసి కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈనెల 28 సాయంత్రం ఆరుగంటల వరకు ధరఖాస్తులు సమర్పించాలని కోరింది.సెలక్షన్ కమిటీలోని ఉన్న ఐదు స్థానాలకు దరఖాస్తులు చేసేవారికి కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు , 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలని బీసీసీఐ తెలిపింది. అలాగే క్రికెట్‌కు కనీసం ఐదేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించి ఉండాలని స్పష్టం చేసింది.

సెలెక్టర్‌ చేతన్ శర్మ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్ రాణించినా..ప్రపంచస్థాయి టోర్నిల్లో మాత్రం చతికిలపడింది. 2020 డిసెంబర్‌లో నేషనల్‌ చీఫ్‌ సెలక్టర్‌గా చేతన్ శర్మ బాధ్యతలు చేపట్టాడు.ఇతని హయాంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజులో ఇంటిదారి పట్టగా.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో‌నూ ఓటమి చవిచూసింది. ఇక 2022 వరల్డ్ కప్ లో సెమీస్ ఘోర పరాజయం పాలైంది.దీంతో సెలెక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ మేరకు సెక్షన్ కమిటీని తొలగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటన చేసింది. తొలగించిన వారిలో చేతన్ శర్మ(నార్త్ జోన్), హర్విందర్ సింగ్ (సెంట్రల్ జోన్), సునీల్ జోషి (సౌత్ జోన్), దేబాసిష్ మొహంతి (ఈస్ట్ జోన్) లు ఉన్నారు. సెలెక్షన్ కమిటీ రద్దుతో మొదట్ వికెట్ పడగొట్టిన బీసీసీఐ.. తర్వాత టార్గెట్ పలువురు ప్లేయర్స్ పైనా ఉంది. రానున్న రోజుల్లో భారీ మార్పులను చేయనున్నట్లు తెలుస్తోంది.