కల్పిత పాత్రలు నీచాతినీచంగా.. భారీ ఫైన్..  - MicTv.in - Telugu News
mictv telugu

కల్పిత పాత్రలు నీచాతినీచంగా.. భారీ ఫైన్.. 

September 18, 2019

tv channel  .....

నేరవార్తలను ప్రేక్షకులకు హత్తుకునేలా అందించడానికి టీవీ చానళ్లు పడరాని పాట్లు పడుతుంటాయి. కల్పిత పాత్రలతో అంటూ అసలు నేరంలోని డోసుకు మించి డోసేస్తుంటాయి. అలాంటి ఒక చానల్ కథ అడ్డం తిరిగింది. గ్యాంగ్ రేప్‌ వార్తకు దట్టంగా మసాలా అంటించినందుకు బ్రాడ్‌కాస్టింగ్ కాంటెంట్ కంప్లయింట్స్ కౌన్సిల్(బీసీసీసీ) ఆ చానల్‌కు తలంటి రూ. 2.5 లక్షల జరిమానా వేసింది. 

సన్ నెట్‌వర్క్‌కు చెందిన తమిళ సన్ టీవీలో వస్తున్న క్రైమ్ ధారావాహిక ‘కల్యాణవీడు’లో కల్పిత పాత్రలు ఘోరంగా మాట్లాడుకున్నాయి. రోజా అనే యువతికి గ్యాంగ్ రేపిస్టులకు మధ్య ఈ తతంగం సాగుతుంది. రోజూ తన సొంత చెల్లెలినే రేప్ చేయాలని వారికి చెబుతుంది. ‘మీరేం సిగ్గుపడండి, బాగా ఎంజాయ్ చెయ్యండి. మీకు డబ్బులిస్తున్న యువతి చెల్లెలినే కాటేస్తున్నామే అని బాధపడకండి. నా చెల్లెకు ఇంకా పెళ్లికాలేదు. ఇంకా కన్యే. నిర్దాక్షిణ్యంగా రేప్ చేయండి..’ అని చెబుతుంది. అయితే రోజాకు బుద్ధిచెప్పడానికంటూ ఈ దుర్మార్గులు ఆమెనే కాటేస్తారు. మొదట ఒకడు పొదల్లోంచి అర్ధనగ్నంగా బయటికి వస్తాడు. మిగతావారితో ‘వెళ్లి ఎంజాయ్ చేయండి’ అంటాడు. తర్వాత రోజా వారిపై పగతీర్చుకుంటుంది. వారిని చంపేసి, జననాంగాలను కోసేస్తుంది.

ఈ దారుణమైన ఎపిసోడ్లను చూసిన కొందరు ప్రేక్షకులు బీసీసీసికి ఫిర్యాదు చేశారు. కల్యాణవీడు అసహ్యకరంగా, నేరాలను ప్రోత్సహించేలా ఉందని భావించిన బీసీసీసీ సన్ టీవీకి రూ.2.5 లక్షల జరిమానా వేసింది. అంతేకాకుండా ఒక వారం పాటు రోజూ ప్రేక్షకులకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది.