BCCI HAVE ANNOUNCED INDIA TEAM FOR THE NEWZLAND, BANGLADESH TOUR
mictv telugu

టీం ఇండియాకు కొత్త కెప్టెన్…న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్ టూర్ లకు భారత్ జట్టు ఎంపిక

October 31, 2022

BCCI HAVE ANNOUNCED INDIA TEAM FOR THE NEWZLAND, BANGLADESH TOUR

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తర్వాత న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్ టూర్ లకు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. నవంబర్ 18 నుంచి జరగబోయే న్యూజిలాండ్ టూర్ కు రోహిత్, కోహ్లికి విశ్రాంతి కల్పించారు. టీ 20లకు కెప్టెన్‌గా హార్దిక్, వన్డేలకు కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శిఖర్ ధావన్ వ్యవహరించనున్నారు. ఇక బంగ్లాదేశ్ తో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‎కు రోహిత్ తన పగ్గాలను అందుకోనున్నాడు. అయితే న్యూజిలాండ్ టీ 20ల్లో దినేశ్ కార్తిక్, అశ్విన్‎లకు స్థానం లభించలేదు. లోకేష్ రాహుల్ కూడా న్యూజిలాండ్ సిరీస్ కు దూరమయ్యి..బంగ్లాదేశ్ సిరీస్ కు జట్టులో చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ తో భారత్ 3 టీ 20లు, 3 వన్డేలు ఆడనుంది.. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 2 టెస్టులు, 3 వన్డేల్లో తలపడనుంది..

BCCI HAVE ANNOUNCED INDIA TEAM FOR THE NEWZLAND, BANGLADESH TOUR
న్యూజిలాండ్ సిరీస్‌కు T20 జట్టు : హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రిషబ్ పంత్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శుభమన్ గిల్ , ఇషాన్ కిషాన్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్,శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.

న్యూజిలాండ్ సిరీస్‌కు వన్డే జట్టు : శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్(వికెట్ కీపర్),వాషింగ్టన్ సుందర్, శార్థుల్ ఠాకూర్, షాజాబ్ అహ్మద్, చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.BCCI HAVE ANNOUNCED INDIA TEAM FOR THE NEWZLAND, BANGLADESH TOUR

బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌కు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ , మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్.

బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ , మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్.