ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కీలక మార్పుల దిశగా బీసీసీఐ..? - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కీలక మార్పుల దిశగా బీసీసీఐ..?

October 22, 2019

BCCI  .

సమ్మర్ వచ్చిందంటే చాలు క్రికెట్ అభిమానులకు పండగే. ఐపీఎల్ సీజన్ మొదలుకావడంతో ఆ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అభిమాన బ్యాట్స్‌మెన్లు ఓవైపు పరుగుల వరద.. మరోవైపు బౌలర్లు వికెట్లు తీస్తుంటే ఆ మజానే వేరు. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు  కొన్ని మార్పులు చేసేందుకు బీసీసీఐ పాలకమండలి ప్రతిపాధనలను సిద్ధం చేస్తోంది. ఇదివరకటిలా నెలరోజుల్లోనే సీజన్ ముగించకుండా రెండు నెలల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వచ్చే సీజన్ నుంచి వీకెండ్‌ల్లో మినహా మిగితా రోజుల్లో కేవలం రోజుకు ఒకే మ్యాచ్ మాత్రమే నిర్వహించాలని యోచిస్తున్నారు. వీటిని కూడా కేవలం రాత్రివేళల్లోనే నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ విధంగా ఐపీఎల్ నిడివి కూడా రెండు నెలలకు పొడిగించేందుకు సిద్ధమయ్యారు. తర్వలో జరగబోయే పాలకమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి ఆమోద ముద్రపడితే మాత్రం క్రికెట్ అభిమానులకు సమ్మర్ సీజన్‌లో రెండు నెలలపాటు పండగే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.