ఈసారి ఇద్దరు మహిళా క్రికెటర్లలో ఒకరికి ప్రతిష్టాత్మాక క్రీడా పురస్కారం అర్జున అవార్డు వరించనుందని తెలుస్తోంది. దేశంలోని స్పోర్ట్స్ అసోషియేషన్స్ నుంచి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ నామినేషన్లను స్వీకరిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో అర్జున అవార్డు కోసం మహిళా క్రికెటర్లు శిఖా పాండే, దీప్తి శర్మ పేర్లను బీసీసీఐ సిఫార్సు చేసింది.
ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఇద్దరూ నిలకడగా ఆడారు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన శిఖా పాండే ఏడు వికెట్లు పడగొట్టింది. ఇక ఆల్‌రౌండర్‌గా దీప్తి శర్మ ఈ టోర్నీలో మొత్తం 116 పరుగులు చేసింది. 2018లో మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అర్జునా అవార్డుని దక్కించుకుంది. 2019లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి అర్జున అవార్డు దక్కింది.