Home > క్రికెట్ > ఖేల్ రత్న, అర్జున అవార్డులకు నలుగురు క్రికెటర్ల ఎంపిక!

ఖేల్ రత్న, అర్జున అవార్డులకు నలుగురు క్రికెటర్ల ఎంపిక!

jnh

దేశంలో క్రీడాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు ఈ ఏడాది భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. అలాగే అర్జున అవార్డుల కోసం టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, బౌలర్ ఇషాంత్ శర్మతో పాటు మహిళా క్రికెటర్ దీప్తి శర్మలను ఎంపిక చేసింది. యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. ఈ అవార్డుల కోసం జనవరి 1, 2016 నుండి 31 డిసెంబర్ 2019 వరకు ఆటగాళ్ల నైపుణ్యం పరిగణలోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ..'మేము చాలా విషయాలను పరిగణలోకి తీసుకొని ఆటగాళ్లను ఎంపిక చేశాం. రోహిత్ శర్మ బ్యాట్స్ మెన్ గా కొత్త బెంచ్ మార్కులను సెట్ చేసాడు. అతని నిబద్ధత, ప్రవర్తన, నిలకడ అతని నాయకత్వ నైపుణ్యాల కోసం ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేశాం. అలాగే ఇషాంత్ శర్మ టెస్ట్ జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడు. టీమిండియా దీర్ఘకాలికంగా నంబర్ 1 టెస్ట్ జట్టుగా ఉండటంలో అతడు కీలక పాత్ర పోషించాడు. శిఖర్ నిలకడగా స్కోరు సాధిస్తూ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీప్తి నిజమైన ఆల్ రౌండర్. జట్టుకు ఆమె అందించిన సహకారం చాలా ముఖ్యమైనది.' అని గంగూలీ అన్నారు.

Updated : 30 May 2020 9:22 PM GMT
Tags:    
Next Story
Share it
Top