ఐపీఎల్ 2020కి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్! - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎల్ 2020కి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్!

July 27, 2020

BCCI sends go-ahead letter on IPL 2020

భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 13వ సీజన్ ఐపీఎల్ త్వరలో జరుగనుంది. ఈ ఏడాది టోర్నమెంట్ దుబాయ్ లో జరుగనుంది. ఇందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీలకి కూడా ఈ మేరకు సమాచారమిచ్చి నెల రోజుల ముందుగానే యూఏఈకి జట్లని తరలించాలని సూచించినట్లు సమాచారం. 

ఐపీఎల్ 2020 సీజన్‌కి ఆతిథ్యమిస్తామని దుబాయ్ కి చెందిన ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు రెండు నెలల క్రితమే తెలిపింది. భారత్ లో కరోనా వైరస్  తగ్గుముఖం పడుతుందని అప్పుడు బీసీసీఐ మౌనంగా ఉండిపోయింది. కానీ, భారత్ లో కరోనా అదుపులోకి రావడం లేదు. దీంతో దుబాయ్ లో జరపడానికి బీసీసీఐ అణిగికరించింది. ఈ మేరకు బీసీసీఐ ఓ లేఖని కూడా ఈసీబీకి పంపినట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ స్పష్టం చేశారు.