బి అలర్ట్.. ముంచుకొస్తున్న తుపాన్ - MicTv.in - Telugu News
mictv telugu

బి అలర్ట్.. ముంచుకొస్తున్న తుపాన్

March 5, 2022

కేంద్ర వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వేసవిలో తొలి తుపాను ముంచుకొస్తుందని హెచ్చరించింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది అని తెలిపింది. ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందిందని.. గత 6 గంటల నుంచి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతోంది అని సూచించింది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం తమిళనాడులోని నాగపట్టణానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.

అంతేకాకుండా ఇక ఇది పూర్తిగా దిశను మార్చుకుని తమిళనాడు వైపు రానుంది. వాయుగుండం కారణంగా తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు, రాయలసీమ, దక్షిణకోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడులో భారీ వర్షాలు పడచ్చని హెచ్చరించింది. కావున తుపాను నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.