Be aware of these terms if you are taking a credit card
mictv telugu

 క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా..?అయితే మీ జేబుకు చిల్లు ఖాయం..ఎందుకో తెలుసా..?

January 26, 2023

Be aware of these terms if you are taking a credit card

చాలామంది క్రెడిట్ కార్డు వాడటం చాలా గొప్ప స్టేటస్ గా ఫీల్ అవుతుంటారు. దీంతో క్రెడిట్ కార్డు వినియోగం ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు మార్కెట్లో ఎన్నో కొత్త కొత్త పేర్లతో క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే తక్కువ వడ్డీ, ఆఫర్లు, రివార్డు అందిస్తున్నాయని క్రెడిట్ కార్డు గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఇష్టం వచ్చినట్లుగా వాడారో…మీ జేబు చిల్లు పడటం ఖాయం.

కంపెనీలు అందిస్తున్న ప్రయోజనాలు మాత్రమే కాదు..మీకు అవసరాలకు ఎలాంటి క్రెడిట్ కార్డును ఉపయోగించాలో అది గ్యారెంటీగా తెలుసుకోవాలి. దాన్ని బట్టి మీరు క్రెడిట్ కార్డు తీసుకోవడం మంచిది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆదాయం క్రెడిట్ స్కోరు ఆధారంగా కార్డు అర్హత లభిస్తుంది. అయితే క్రెడిట్ కార్డు తీసుకునే ముందు మనం కొన్ని విషయాలను తప్పకుండా గుర్తించుకోవాలి. అవేంటో ఓ సారి చూద్దాం.

మీ అవసరాన్ని బట్టి సెలక్ట్ చేసుకోండి.

ముఖ్యంగా మీరు కార్డును ఎలా వాడుతుంటారనేది కీలకం. కొందరు ఆన్ లైన్ షాపింగ్ కోసం వాడుతుంటారు. అలాంటప్పుడు షాపింగ్ వెబ్ సైట్లు, డిస్కౌంట్లపై అందించే కార్డును సెలక్ట్ చేసుకోవాలి. మార్కెటింగ్ చేస్తున్నవారు ద్విచక్రవాహనంపై ఎక్కువగా తిరిగే అవకాశం ఉంటుంది. పెట్రోలుపై క్యాష్ బ్యాక్, అధికా రివార్డులను అందించే కార్డును వాడటం బెటర్ .

మీ వాడకాన్ని బట్టి కార్డును ఎంచుకోండి.

డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, రివార్డ్ వంటి వాటి కోసం క్రెడిట్ కార్డు ఎలా పనిచేస్తుందన్న విషయాన్ని పూర్తి తెలుసుకున్న తర్వాతే..మీరు కార్డును ఉపయోగించండి.

-మీ ఆదాయాన్ని బట్టి క్రెడిట్ కార్డు పరిమితిని బ్యాంకులు నిర్ణయిస్తాయి. 50శాతానికి మించి ఉపయోగించకపోవడం మంచిది. లేదంటే అది క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది.

-కొన్ని బ్యాంకులు కార్డులపై వార్షిక ఛార్జీలు వసూలు చేయనప్పటికీ…ఆ నిబంధన కూడా కొన్ని పరిమితులకు లోబడి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఏడాదిలో వినియోగదారులు ఒక నిర్ణీత మొత్తాన్ని ఖర్చు చేసినప్పుడే ఆ రకమైన బెనిఫిట్ పొందుతారు. ఏ కార్డు అయినా సరే బిల్లును మాత్రం నిర్ణీత గడవు లోపే చెల్లించాల్సి ఉంటుంది.