నేడు, రేపు జాగ్రత్తగా ఉండండి: వాతావరణ శాఖ - MicTv.in - Telugu News
mictv telugu

నేడు, రేపు జాగ్రత్తగా ఉండండి: వాతావరణ శాఖ

April 28, 2022

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు, రేపు సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కావున ప్రజలు ఈ రెండు రోజులు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప, ఇంట్లో నుంచి బయటికి రావొద్దని కోరారు.

ఇక, బుధవారం ఆదిలాబాద్‌ జిల్లాలోని జైసద్‌లో అత్య‌ధికంగా 45.7 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త, జగిత్యాలలోని ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని అధికారులు చెప్పారు. దీంతో ఓ వైపు తీవ్రమైన ఎండ‌, మరోవైపు విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ఈ క్రమంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావ‌ర‌ణ శాఖ‌ అధికారులు పేర్కొన్నారు. ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కూడా ప‌డే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించారు.