Be careful with these smartwatches: Center
mictv telugu

ఈ స్మార్ట్ వాచీలతో జాగ్రత్త: కేంద్రం

July 26, 2022

దేశ యువతకు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. యాపిల్ స్మార్ట్ వాచీలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు యాపిల్ స్మార్ట్ వాచీలను ఆసరాగా చేసుకోని, దాడులు చేయడానికి ముమ్మరంగా ప్రయాత్నాలు చేస్తున్నారని, యాపిల్ స్మార్ట్ వాచీలను వినియోగిస్తున్న యువత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సోమవారం పలు హెచ్చిరికలతో కూడిన ఓ ప్రకటనను విడుదల చేసింది.

విడుదల చేసిన ప్రకటనలో.. ”యాపిల్ వాచ్‌లను వినియోగిస్తున్న వారికి హెచ్చరిక.. యాపిల్ వాచ్‌లలో వినియోగించే వాచ్ ఓఎస్ (8.7కి ముందు వెర్షన్లు)లో అనేక లోపాలు ఉన్నాయి. ఈ లొసుగుల సాయంతో హ్యాకర్లు వాచ్‌లోకి చొరబడి ఆర్బిట్రేటరీ కోడ్ రన్ చేయడమే కాకుండా, సెక్యూరిటీ వ్యవస్థలను బైపాస్ చేసి స్మార్ట్ వాచ్‌ను వారి అధీనంలోకి తెచ్చుకోగలరు. వాచ్ ఓఎస్ పాత వెర్షన్లు వాడుతున్న వారు వెంటనే కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి. యాపిల్ నుంచి సెక్యూరిటీ ప్యాచెస్ కోరాలి” అని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) అధికారులు పేర్కొన్నారు.

మరోపక్క యాపిల్ కూడా తన సపోర్ట్ పేజీలో ఈ లోపం గురించి ప్రస్తావించింది. ”యాపిల్ ఏవీడీ కాంపోనెంట్‌లో బఫర్ ఓవర్‌ఫ్లో కారణంగా ఆడియో, ఐసీయూ, వెబ్‌కిట్ వంటి ఫీచర్లలోకి మాల్‌వేరు పంపి టైపింగ్, జీపీయూ డ్రైవర్స్, కెర్నెల్ కాంపొనెంట్స్‌లో యూజర్‌ను కన్ఫ్యూజ్ చేసి డేటా దొంగిలించే అవకాశం ఉంది. కెర్నెల్ కోడ్ ఎగ్జిక్యూషన్‌లో యాపిల్ ఏవీడీని ఇది ప్రభావితం చేస్తుంది. ఈ సైబర్ దాడి నుంచి తప్పించుకునేందుకు యూజర్లు తమ వాచ్ ఓఎస్‌ను వెంటనే లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాలి” అని పేర్కొంది. మరి ఇంకెందుకు ఆలస్యం యాపిల్ వ్యాచ్‌లు వినియోగిస్తున్న వారు వెంటనే అప్‌డేట్ వెర్షన్ చేయించుకోండి.