Be ready..Notification in October itself!: KCR
mictv telugu

సిద్దంగా ఉండండి..అక్టోబర్‌లోనే నోటిఫికేషన్!: కేసీఆర్

September 22, 2022

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నల్గొండ జిల్లా మునుగోడు మండలానికి సంబంధించి, ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు, నాయకులు వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు..మునుగోడులో భారీ బహిరంగ సభలు నిర్వహించి, ఉప ఎన్నికకు సంబంధించిన పలు విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాయి. తాజాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అయితే, టీఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటువంటి సమయంలో కేసీఆర్..మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం రాత్రి నల్గొండ జిల్లా మంత్రులతో, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ అక్టోబర్‌ నెలలో రావొచ్చని, నవంబర్‌లో ఉప ఎన్నిక జరగొచ్చని, టీఆర్ఎస్ నేతలు ఇంటింటికీ తిరిగి పార్టీ విజయానికి కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

కేసీఆర్ మాట్లాడుతూ..”మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్‌లో ప్రకటించవచ్చు. నవంబర్‌లో ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈరోజే ఎన్నికలు జరుగుతున్నాయి అన్నట్లుగా పార్టీ శ్రేణులు కష్ట పడాలి. ప్రతి గ్రామంలో దళిత బంధుపై అవగాహన కల్పించాలి. రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యేను ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే చండూరులో బహిరంగ సభ నిర్వహిస్తాం. ఉపఎన్నికకు పిలుపునిచ్చిన బీజేపీ ప్రస్తుతం భయంతో వణికిపోతుంది” అని ఆయన అన్నారు.