బీఅలర్ట్.. కొత్తగా 12 వేల కేసులు నమోదు: కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

బీఅలర్ట్.. కొత్తగా 12 వేల కేసులు నమోదు: కేంద్రం

June 16, 2022

కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు కరోనా విషయంలో దేశ ప్రజలు బీఅలర్ట్‌గా ఉండాలని కోరారు. గతకొన్ని రోజలుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, ప్రజలు మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించాలని సూచించారు. గురువారం కరోనా కేసులకు సంబంధించి బులెటిన్ విడుదల చేశారు. గతకొన్ని రోజులుగా 8వేలలోపు నమోదవుతోన్న కేసులు ఒక్కసారిగా 12 వేల మార్కును దాటిందని, బుధవారంతో పోలిస్తే, గురువారం ఒక్కరోజే 38.4శాతం కేసులు రావడం ఆందోళ కలిగించే అంశామని అధికారులు వివరాలను వెల్లడించారు.

”గడిచిన 24 గంటల్లో దేశంలో 12,213 మంది కోవిడ్‌ బారినపడ్డారు. నిన్నటితో పోలిస్తే, గురువారం 38శాతం కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 తరువాత ఇంత భారీ స్థాయిలో కేసులు రావటం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు 4,32,57,730 మంది కరోనా బారినపడగా, బుధవారం 11 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మరణాల సంఖ్య 5,24,803కు చేరింది. నిన్న ఒక్క రోజు 7,624 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 4,26,74,712 మంది డిశ్చార్జి అయ్యారు. యాక్టిక్‌ కేసుల సంఖ్య 58,215కు పెరిగింది. పాజిటివిటీ రేటు 2.35% శాతంగా ఉంది. రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది.”

ఇక, రాష్ట్రాల వారిగా చూస్తే.. అత్యధికంగా మహారాష్ట్రలో 4,024, కేరళలో 3,488 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్క ముంబైలోనే నిన్న రెండు వేలకు పైగా కేసులొచ్చాయి. అయిదు నెలల తర్వాత అక్కడ ఇన్ని కేసులు కావడం ఇదే తొలిసారి. నిన్న ఒక్క రోజు 1.21 లక్షల మంది టీకా తీసుకోగా, ఇప్పటి వరకు 195 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.