Bealert..Heavy rains for the next three days
mictv telugu

బీఅలెర్ట్..రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు

August 6, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్‌లో ఉన్న వాతావరణ శాఖ అధికారులు కాసేపటిక్రితమే ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు, చిరువ్యాపారులు, ఉద్యోగులు, యువకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.

”ఇవాళ, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ పలు జిల్లాలో ఉరుములతో, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఈరోజు రుతుపవన ద్రోణి జైసల్మేర్, కోట, సాగర్, పెండ్రా రోడ్ గుండా బాలాసోర్ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళ్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఆవర్తనం ఇవాళ వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది” అని ప్రకటనలో పేర్కొన్నారు.