బీఅలర్ట్..రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు.. - MicTv.in - Telugu News
mictv telugu

బీఅలర్ట్..రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు..

June 24, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కొన్ని లోన్ యాప్స్ వినియోగదారులు లోను కావాలని ఎలాంటి రిక్వెస్ట్‌లు పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు. ఆ తర్వాత ఏడు రోజుల్లో డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తూ, వినియోగదారులను బెదిరిస్తున్నారు. ఫొటో మార్ఫింగ్‌లు చేస్తామని, డబ్బులు చెల్లించపోతే ఇంటికొచ్చి సామాన్లు తీసుకెళ్తామని కీచకులు వేధిస్తున్నారు. ప్రజలు లోన్ యాప్స్ పట్ల బీఅలర్ట్‌గా ఉండాలని పోలీసులు తెలిపారు. తాజాగా లోన్స్ యాప్స్‌పై నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు.

”కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి, నేరుగా యాప్ డౌన్ లోడ్ లింక్స్ పంపుతున్నారు. లింక్ ఓపెన్ చేసిన వెంటనే వినియోగదారుని ఖాతా వివరాలను సేకరించి, అడగకముందే డబ్బులు పంపిస్తున్నారు. ఆ తర్వాత ఏడు రోజుల్లో డబ్బులు చెల్లించాలని, చెల్లించకపోతే ఇంటికొచ్చి సామాన్లు తీసుకెళ్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఫొటో మార్ఫింగ్‌లు చేసి వేధిస్తున్నారు. తాజాగా కొంతమంది బాధితులు ఫిర్యాదులు చేయడంతో వారిపై దర్యాప్తు చేపట్టాం. చైనా నుంచి ముగ్గురు ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించాం. కాల్ సెంటర్లు లేకుండా వర్క్ ఫ్రమ్ హోం ద్వారా ఈ ముఠా దారుణాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాం. గూగుల్ ట్రాన్స్ లేషన్ ద్వారా భాష తెలుసుకుని కేటుగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు” అని వివరాలను వెల్లడించారు.

అనంతరం కొంతమంది బాధితులు మాట్లాడుతూ..”లోన్ కావాలని నేను ఎలాంటి రిక్వెస్ట్ పెట్టలేదు. అయినా, నా అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. డబ్బులు పడిన వెంటనే ఓ కాల్ వచ్చింది. ఏడు రోజుల్లో డబ్బులు చెల్లించాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. చెప్పిన టైంకి డబ్బులు ఇవ్వకపోతే ఫొటో మార్ఫింగ్‌లు చేస్తామని అన్నారు. పైగా తిడుతున్నారు. అడక్కపోయినా అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు” అని ఆ వ్యక్తి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశామని అన్నారు.