బీఅలర్ట్.. 15వేలు దాటిన పాజిటివ్ కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

బీఅలర్ట్.. 15వేలు దాటిన పాజిటివ్ కేసులు

April 23, 2022

భారతదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించటం మొదలుపెట్టింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగటం ప్రారంభమైయ్యాయి. కొత్తగా 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4.5 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా, అందులో 2,527 మందికి పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఢిల్లీలో అత్యధికంగా 1,042 కేసులు నమోదు కాగా, కరోనాతో 33 మంది మృతి చెందారు. వీటిలో 31 మరణాలు కేరళలో సంభవించగా, ఢిల్లీలో ఇద్దరు మరణించారు. దేశ వ్యాప్తంగా 1,656 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈరోజు కూడా కరోనా నుంచి కోలుకున్న వారికంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం కలవరం రేపుతుందని అధికారులు పేర్కొన్నారు.

మరోపక్క దేశంలో పాజిటివిటీ రేటు 0.56 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.75 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 15,079 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 187 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు వేశారు. నిన్న 19.13 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.