ఎలుగుబంటి..ఇల్లు పీకి పందిరేసింది..! - MicTv.in - Telugu News
mictv telugu

ఎలుగుబంటి..ఇల్లు పీకి పందిరేసింది..!

June 6, 2017

ఎవరు లేని సమయంలో ఓ ఇంట్లోకి ఎలుగుబంటి దూరింది. ఇంట్లో వస్తువుల్ని చిందరవందర చేసింది. ఓపెన్ విండో నుంచి లోపలికి వ‌చ్చిన ఎలుగుబంటి కిచెన్ మొత్తాన్ని కిచిడి చేసింది. ఆ త‌ర్వాత అదే కిచెన్ విండో నుంచి చెక్కేసింది. ఇంట్లో ఉన్న సామాన్లు చిందర వంద‌ర గా పడి ఉండ‌టాన్ని చూసి షాక్ తిన్న ఓనర్స్ దొంగ‌లు ప‌డ్డారేమో అని పోలీసుల‌కు కంప్లయింట్ చేశారు.వెంటనే వచ్చిన పోలీసులు ఇంట్లో అమ‌ర్చిన సీసీకెమెరా ఫూటేజీని ప‌రిశీలించి అవాక్కయ్యారు. అందులో ఎలుగుబంటి ఇంట్లో తిరిగిన వీడియో రికార్డ‌యింది. ఇంతకీ ఇది జరిగిందో ఎక్కడో తెలుసా అమెరికాలోని కొలొర‌డొ రాష్ట్రంలో…దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ను మీరూ చూసేయండి.