bear halhal three people in Tamil Nadu's Tenkasi
mictv telugu

ముగ్గురిపై ఎలుగుబంటి భీకర దాడి.. షాకింగ్ వీడియో..

November 7, 2022

అటవీ ప్రాంతం గుండా బైక్‌పై వెళ్తున్న మనిషిపై ఓ భల్లూకం భీకరంగా దాడి చేసింది. తల, కాళ్లు, చేతలు.. ఏమీ వదలకుండా చిత్రవధ చేసింది. తమిళనాడులోని తెంకాశీ జిల్లాలలో ఈ ఘోరం జరిగింది. కరుతిలింగాపురం గ్రామానికి చెందిన వైకుంఠమణి.. శివశైలం నుంచి పెతాంపల్లికి బైకుపై మసాలా ప్యాకెట్లు తీసుకెళ్తుండగా పొదల్లోంచి వచ్చిన ఎలుగు అమాంతం మీద పడి కొరికింది. దారిలో వెళ్తున్న జనం దాన్ని తరిమికొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అది వైకుంఠమణిని ఏమాత్రం వదలకుండా దాడి చేసింది. దాన్ని తరికొట్టేందుకు ప్రయత్నించి నాగేంద్రన్, శైలేంద్ర అనే యువకుడిపైనా భీకరంగా దాడి చేసింది. దీంతో ఎవరూ దాని దగ్గరికి వెళ్లే ధైర్యం లేక వీడియో తీసుకున్నారు. అటవీ శాఖ అధికారులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఎలుగుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు.