ఎలుగుబంటికి మందు పట్టించి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎలుగుబంటికి మందు పట్టించి..

April 2, 2018

మనుషులు తమ జాడ్యాలను మూగజీవాలకూ అంటిస్తున్నారు. తాము చెడిపోయింది చాలక మూగజీవాలనూ చెడగొడుతున్నారు. ఒక ధనిక యువతి.. ఎలుగుబంటికి మద్యం తాగించి తీయించుకున్న వీడియో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుర్తుతెలియని మంచు కొండల్లో ప్రాంతంలో ఈ యువతి.. ఎలుగుకు చాంపేన్ పోయినట్లు  తెలుస్తోంది.

follow @yenworldwide now for more amazing stuff! ??? @yenworldwide

A post shared by RICH KIDS OF LONDON (@richkidslondon) on

ధనికుల పిల్లలకు సంబంధించిన రిచ్ కిడ్స్ ఆఫ్ లండన్ ఇస్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఫర్ కోటు తొడుక్కున్న యువతి మందుతాగిన ఎలుగు గొంతను, ఛాతీని సవరిస్తూ ఉంది. సాధారణ ఎలుగుబంట్లలా కాకుండా ఈ ఎలుగు ప్రవర్తన విపరీతంగా ఉందని, ఆమె కచ్చితంగా దానికి మద్యం తాగించి ఉంటుందని భావిస్తున్నారు. మరికొందరైతే.. అది అడవి ఎలుగు కాదని, పెంపుడు ఎలుగని అంటున్నారు.