ఖమ్మంలో ‘వింత జంతువు’.. తోక ముడుస్తున్న కోతులు - MicTv.in - Telugu News
mictv telugu

ఖమ్మంలో ‘వింత జంతువు’.. తోక ముడుస్తున్న కోతులు

December 11, 2019

monkeys run.

ఇప్పుడు ఏ గ్రామాన్ని చూసినా కోతుల బెడద ఉంది. ఉప్పులు, పప్పులు ఏవీ ఉంచడంలేదు. ఇళ్లవద్ద పెంచుకునే పళ్ల చెట్లను మాత్రం అస్సలు వదిలిపెట్టడంలేదు. ఇక పంటపొలాలను అదే తీరున నాశనం పట్టిస్తున్నాయి. మడుల్లోనే కూరగాయలను హాంఫట్ చేసేస్తున్నాయి. వాటి బెడదను తప్పించుకోవడానికి వివిధ గ్రామస్తులు రకరకాల జిమ్మిక్కులు వేస్తుంటారు. పులి బొమ్మలు పెడతారు, కొండముచ్చును తీసుకువస్తారు. డప్పులతో బెదిరిస్తారు. కుక్కలతో దాడి చేయిస్తారు. అయినా అవి అడవుల్లోకి పోమంటే పోమన్నట్టే చేస్తుంటాయి. కోతుల బెడద నుంచి ఉపశమనం కోసం ఖమ్మం జిల్లా కొణిజర్ల సర్పంచ్ సూరంపల్లి రామారావు మాత్రం ఓ వినూత్న ఆలోచనకు తెరలేపారు.  

కొండముచ్చులను కూడా బెదరని కోతుల తిక్క కుదర్చటానికి ఆయన వెరైటీగా ఓ వ్యక్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అతనికి ఎలుగుబంటి వేషం వేశారు. అతను ఆ వేషాధరణతో ఊరంతా తిరుగుతాడు. ఎలుగు ఆకారంలో ఉన్న ఆ వ్యక్తిని చూసి కోతులు పరుగులు తీస్తున్నాయి. గ్రామంలోని పిల్లలు ఆ వ్యక్తిని వింతగా చూస్తూ అతనితో ఫోటోలు దిగుతున్నారు. బాగుంది కదూ ఈ ఉపాయం.