Bears Enter Into Temple
mictv telugu

100 కేజీల దేవుడి గంట కొట్టిన ఎలుగుబంటి

November 2, 2022

గుడిలోకి ఎలుగుబంటి ప్రవేశించి దేవుడి దగ్గర గంట కొట్టిన అరుదైన దృశ్యం శ్రీ సత్యసాయి జిల్లాలో కనిపించింది. మడకశిర నియోజవకవర్గంలో ఉన్న రొళ్ల మండలం జీరిగేపల్లిలోని శ్రీ అమ్మాజీ ఆలయంలోకి రెండు ఎలుగు బంట్లు ప్రవేశించించి కలియతిరిగాయి. వాటిలో ఓ ఎలుగుబంటి గుడి గంటకు వేలాడుతున్న తాడును నోట్లో కరుచుకొని.. ముందు కాళ్లతో లాగుతూ గంటను మోగించింది.భక్తితో చేశాయో.. మరేమో కానీ ఈ దృశ్యాలు మొత్తం ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ ఘటన ప్రతి జీవిలో దైవ భక్తి ఉందనటానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ ఘటనపై ఆ ఆలయ పూజారి మాట్లాడారు. ఈ ఆలయంలోకి ఎలుగుబంట్లు తరచూ వస్తుంటాయని, ఆలయంలో అమ్మవారికి సమర్పించిన ప్రసాదాన్ని, పళ్లను తిని వెళ్తుంటాయని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.