నా కొడుకు వల్లే 'బీస్ట్' హిట్టు అయ్యింది: చంద్రశేఖర్ - MicTv.in - Telugu News
mictv telugu

నా కొడుకు వల్లే ‘బీస్ట్’ హిట్టు అయ్యింది: చంద్రశేఖర్

April 20, 2022

 17

తమిళ చిత్రసీమ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన హీరోగా నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్‌ను ఎంత షేక్ చేశాయో, ఎన్ని కలెక్షన్లను రాబట్టినాయో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. తాజాగా విజయ్ నటించిన కొత్త చిత్రం “బీస్ట్”. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. టెర్రరిజం నేపథ్యంలో సాగే కథాంశంతో పవర్యక్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపుదిద్దారు.

ఈ సినిమాను ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. అయితే, సినిమాను వీక్షించిన ప్రేక్షకులు కొంతమంది ఫర్వాలేదు అంటే మరికొంతమంది అస్సలు బాగాలేదంటూ విమర్శలు చేశారు. సినిమా విడుదలైనా రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ, మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఫైట్స్, సాంగ్స్ అన్నీ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో నెల్సన్ ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే బాగుండేదని ప్రేక్షకులు వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు.

కానీ, ‘బీస్ట్’ డైరెక్టర్ నెల్సన్‌పై విజయ్ తండ్రి దర్శకుడు చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లైవ్‌లోనే నెల్సన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా కొడుకికి ఉన్న స్టార్‌డమ్ వల్లే ‘బీస్ట్’కి భారీ వసూళ్లు వస్తున్నాయి. నా కొడుకు విజయ్ నటన వల్లే ఈ ‘బీస్ట్’ సినిమా హిట్టు కొట్టింది. డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వం నిరాశ పరిచింది” అని ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.