జాబ్స్ కొట్టండి.. పాలనలో భాగస్వాములు కండి: కవిత - MicTv.in - Telugu News
mictv telugu

జాబ్స్ కొట్టండి.. పాలనలో భాగస్వాములు కండి: కవిత

March 17, 2022

kavatha

తెలంగాణలో కేసీఆర్ నిరుద్యోగుల‌కు తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆయా ప్రభుత్వ శాఖల్లోని 91,142 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, వెంటనే 80,039 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేస్తున్నామని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పట్టడం మొదలెట్టారు. మరికొంతమంది కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ఈ నేపథ్యంలో గురువారం ఎమ్మెల్సీ క‌విత వినూత్న రీతిలో నిరుద్యోగులకు స‌ల‌హా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”ముందుగా తెలంగాణ ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు. మాములుగా ఏ పండగైనా అందరికీ సంతోషంగా ఉంటుంది. మరి ముఖ్యంగా హోలీ పండగ అంటే చిన్న,పెద్ద, పిల్లా, పాప అందరూ కలిసి ఉత్సాహంగా చేసుకునే పండగ. ఒకరి మీద ఒకరు రంగులు జల్లుకొని, ఆనందంతోటి జరుపుకునే పండగ. కాబట్టి అందరు కూడా ఆర్గనిక్ కలర్స్‌‌తోటి ఆడుకునే ప్రయత్నం చేయండి. అలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది” అని ఆమె కోరారు.

అంతేకాకుండా చిరు ఉద్యోగుల జీవితాల్లో కేసీఆర్ రంగులు నింపడం జరిగింది. అలాగే, యువ మిత్రులకు కూడా 80 వేల ఉద్యోగాలను కేసీఆర్ ప్రకటించారు. మీరందరూ కూడా శ్రద్ధపెట్టి చదవండి. ఎందుకంటే మనం రాష్ట్రం తెచ్చుకున్నది పరిపాలనలో మనం భాగస్వాములు కావడానికే. కాబట్టి కేసీఆర్ బాగా ఆలోచించి 95శాతం ఉద్యోగాలు మన యువతకే వచ్చే విధంగా ప్రణాళిక తయారు చేశారు” అని కవిత నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. దీంతో నిరుద్యోగుల్లో స‌రికొత్త ఉత్సాహం నెలకొంది. ఉద్యోగం సాధించాలనే భావ‌న మరింత దృఢంగా నాటుకుపోయింది.