అమరావతిలో స్థానిక ఎన్నికలు వాయిదా… ఓటమి భయంతో! - MicTv.in - Telugu News
mictv telugu

అమరావతిలో స్థానిక ఎన్నికలు వాయిదా… ఓటమి భయంతో!

January 13, 2020

Amaravathi.

ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడనున్నాయి. ప్రభుత్వం సాంకేతిక కారణాలను సాకుగా చూపుతున్నా.. ‘రాజధాని’ నిరసన నేపథ్యంలో ఈ వ్యవహారం అనుమానాలకు దారి తీస్తోంది. అమరావతి పరిధిలోని గ్రామాలను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయించాలని ఈసీకి ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారు. రాజధాని తరలింపు నేపథ్యంలో  ఈ ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమరావతికి మద్దతు పలికే పార్టీలకే ఓట్లు పడే అవకాశాలు ఉండటంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

కాగా, అమరావతి ప్రాంతంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇవాళ జరిగే హై పవర్ కమిటీలో చర్చించనున్నట్లు సమాచారం. యర్రబాలెం, బేతపూడి, నవులూరును మంగళగిరి మున్సిపాలిటీలో కలపాలని.. పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లిలో కలపాలని ప్రతిపాదించారట. మిగిలిన గ్రామాలన్నింటినీ కలిపి అమరావతి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందట. అందుకే ఎన్నికల సంఘానికి లేఖ రాశారని.. దీనిపై ప్రభుత్వం స్ఫష్టత ఇవ్వాల్సి ఉంది.