లాక్‌డౌన్ ఛాలెంజ్ విసిరిన గిన్నిస్ సంస్థ.. ఏం చెయ్యాలంటే..  - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ ఛాలెంజ్ విసిరిన గిన్నిస్ సంస్థ.. ఏం చెయ్యాలంటే.. 

April 5, 2020

Become a record holder at home with #GWRChallenge

రకరకాల ఛాలెంజ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నవేళ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్  సంస్థ కూడా ఓ ఛాలెంజ్ విసిరింది. ఇంట్లో ఊరికే కూర్చోకుండా తాము విసిరిన ఛాలెంజ్‌లో పాల్గొని మీ సత్తా నిరూపించుకోమంది. టాయ్‌లెట్‌‌లో ఉపయోగించే టిష్యూ పేపర్ రోల్‌ను 30 సెకన్ల పాటు కింద పడకుండా గాల్లోనే ఎగరేయాలని చెప్పింది. ఇదెంత పనీ అని అనుకోవద్దు. అక్కడే ఓ తిరకాసు ఉందిమరి. ఇలా పేపర్ రోల్ ఎగరేయడానికి చేతుల్ని, మోచేతుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు అన్నమాట. అదే ఈ ఛాలెంజ్‌లో ట్విస్ట్. కెమెరా ముందుకు వచ్చాక 3, 2, 1, రెడీ అనగానే ఎగరేయడం ప్రారంభించాలి. 

ఇలా చేస్తూ తీసిన వీడియోను సంస్థకు పంపాలి. వీడియో అప్‌లోడ్‌ చేసేందుకు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాంలను ఉపయోగించుకోవచ్చు. జీడబ్ల్యూఆర్ చాలెంజ్ అన్న హ్యాష్ ట్యాగ్ వీడియోకు జత చేయాలి. 30 సెకన్లలో ఎవరు ఎక్కువసార్లు ఎగరవేస్తారో వారే విజేత అన్నమాట. ఎగరేసే క్రమంలో పేపర్ రోల్ గోడకు, కుర్చీలకు తగిలినా, కిందపడినా ఫలితం ఉండదు. ఎడిట్ చేసిన వీడియోలు పంపినా చెల్లవు. అర్హమైన వీడియోల నుంచి వారానికో విజేతను సంస్థ ప్రకటిస్తుంది. బాగుంది కదూ ఈ ఛాలెంజ్.. ఇంకెందుకు ఆలస్యం మీరూ ప్రయత్నించండి.