తల్లి కాబోతున్నాను: ప్రణీత - MicTv.in - Telugu News
mictv telugu

తల్లి కాబోతున్నాను: ప్రణీత

April 11, 2022

 

టాలీవుడ్ హీరోయిన్, అత్తారింటికి దారేది సినిమాలో తన నటనతో, కళ్ళతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన బాపుగారి బొమ్మ, నటి ప్రణీత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు ఓ పోస్ట్‌ను పెట్టింది. అంతేకాకుండా కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. “నా భర్త 34వ పుట్టిన రోజు నాడు. దేవతలు మాకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు” అని ప్రణీత పేర్కొంది. దీంతో ఆమె పెట్టిన పోస్ట్‌లపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు అంటూ స్పందిస్తున్నారు.

 

 

మరోపక్క ప్రణీత దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించారు. ‘అత్తారింటికి దారేది’, ‘రభస’, ‘పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాలు నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. కరోనా సమయంలోనూ పేదల కోసం ఆమె తనవంతు సాయం చేశారు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని గతేడాదిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఈ గుడ్‌న్యూస్ చెప్పడంతో అభిమానులు ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు.