BeeAlert: Heavy rain today and tomorrow
mictv telugu

బీఅలెర్ట్: నేడు, రేపు భారీ వర్షాలు

September 29, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తూ, ప్రాథమిక హెచ్చరికను జారీ చేశారు.

విడుదల చేసిన హెచ్చరికలో..”బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతోపాటు, నైరుతి రుతుపవనాల కారణంగా గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండండి.” అని అధికారులు పేర్కొన్నారు.

తాజాగా హైదరాబాద్‌లో భారీ వర్షం పడి, పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయిన విషయం తెలిసిందే. గతరాత్రి హయత్ నగర్, ఎల్.బి నగర్, దిల్‌సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ క్రమంలో నేడు, రేపు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.