తనకు తానే జరిమానా వేసుకున్న కలెక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

తనకు తానే జరిమానా వేసుకున్న కలెక్టర్

October 9, 2019

ఓ జిల్లా కలెక్టర్ తనపై తాను జరిమానా విధించుకున్న సంఘటన మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకుంది. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇటీవల నామినేషన్ల ప్రకియ కూడా పూర్తయింది. ఈ క్రమంలో ఎన్నికల నుంచి తప్పుకున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు బీఢ్ జిల్లా కలెక్టర్ ఆస్తిక్ కుమార్ పాండే ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

collector.

దీనికి హాజరైన జర్నలిస్టులకు వాడిపారేసే ప్లాస్టిక్ కప్పుల్లో టీ ఇచ్చారు. ఈ విషయాన్ని గమనించిన ఓ జర్నలిస్టు కలెక్టర్‌ను సూటిగా ఓ ప్రశ్న అడిగారు..’ఒక సారి వాడిపడేసే ప్లాస్టిక్‌పై రాష్ట్రంలో నిషేధం ఉంది కదా.. మరి ప్లాస్టిక్ కప్పుల్లో టీ ఎలా ఇస్తారు’ అని అడిగారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తప్పుజరిగిందని అంగీకరిస్తూ.. దీనికి తానే బాధ్యత తీసుకుంటునట్టు తెలిపారు. అంతే కాకుండా.. వెంటనే తనపై తాను రూ.5000 జరిమానా విధించుకున్నారు. అనంతరం నిబంధనలకు ఉల్లంఘించిన అధికారులను పిలిపించి వివరణ కోరారని.. ఎన్నికల విధులలో బిజీగా ఉన్న కారణంగా ఈ పొరపాటు జరిగిందని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.