వేద బ్రాహ్మణుల భోజనంలో "బీఫ్” నిజమా..అబద్దమా... - MicTv.in - Telugu News
mictv telugu

వేద బ్రాహ్మణుల భోజనంలో "బీఫ్” నిజమా..అబద్దమా…

May 29, 2017

ప‌శువ‌ధ‌పై కేంద్ర ప్ర‌భుత్వం నిషేధం విధించిన తర్వాత దేశంలో బీఫ్ పాలిటిక్స్ రాజుకుంటున్నాయి. అనుకులంగా కొందరు వ్యతిరేకంగా మరికొందరు వాదులాడుకుంటున్నారు. వేద బ్రాహ్మణులకు కూడా వారి భోజనంలో “బీఫ్” ఉండేదని వారు నమ్మిన గ్రంథాల్లోనే రాయబడింది అనే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోస్ట్ యాజ్ టిజ్ గా కింద ఉంచుతున్నాం…

వేద బ్రాహ్మణులకు కూడా వారి భోజనంలో “బీఫ్” ఉండేదని
వారు నమ్మిన గ్రంథాల్లోనే రాయబడింది. కావాలంటే ఇదిగో ఋజువులు చూడండి.. !

1 – “ అధో అన్నం వాయ్ గోవా” – “వాస్తావానికి గోవు మన ఆహారం “. –— (ఐతేరియ బ్రహ్మణ్యం: – 111.9.8 )

2 – “ మాంసం లేకుండా మధువు ను తీసుకోవడం సాధ్యంకాదు “ —-( ఆశ్వలాయన గృహ్య సూత్రం: 1-4 )

3 – “పండితుడు , ప్రసిద్ధుడు , సామాజికుడు , శ్రోతలున్న వక్త , వేదపాటి , దీర్గాయుష్మంతుడు అగు పుతున్ని కనాలన్న కోరికగల తల్లి, ఆబోతు లేదా ఎద్దు             మాంసం నేతితో వండుకొని తినవలయును” —-(బృహదారణ్యకం )

4 – “ వయస్సు లో వున్న దూడది కానీ , లేదా ముదురు వయస్సు లో వున్న ఎద్దుది కానీ భుజించాలి “—- (శంకారాచార్యులు)

5 – “ నా శరీరం మాంసమై ఉన్నంత వరకు నేను లేత ఆవు మాంసం తింటాను “. –– ( యజ్ఞావల్కుడు – శతపద బ్రాహ్మణం )

6- భరద్వాజుడు ఒక అవుదూడను వధించి రాముడిని బోజనానికి ఆహ్వానించాడు— ( రామాయణం )

7- ఎన్ని యజ్ఞాలు , యాగాలు చేసినా మాంసం తిననివాడు రాబోయే ఇరవై జన్మలు జంతువుగానే పుడతాడు. —-( మనుధర్మ శాస్త్రం – 35 వ సూక్తం )

8 – ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చు , పాలు ఇచ్చే ఆవులను దూడలను బలి ఇవ్వచ్చు కానీ కటిక వానికి అమ్మకుడదు. —-( కౌటిల్యుని అర్ధ శాస్త్రం )

9 – ఉత్తర క్రియలలో ( దశదిన కర్మ లో) భాగం గా ఆవునో , ఎద్ధునో వధించి బ్రాహ్మణులకు విందు ఇచ్చేవారు. —–( రుగ్వేదం 10 ,14 -1 )

10 – రంతి దేవుని వంట గదిలో ఆవును వధించి ధాన్యం తో పాటు మాంసం వడ్డించేవారు—– ( అధర్వణ వేదం – 11.2 , 4 )

11 – ఇంద్రునికి , శివునికి గోవులు బలివ్వాలి , గర్భిని స్త్రీ లు ఎర్ర ఆవు మాంసం తింటే పండంటి బిడ్డ కు జన్మనిస్తారు.—– ( యాజ్ఞవల్క స్మృతి )

12 – ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది, ప్రాచిన , ఆద్యాత్మిక గ్రంథాలూ , సనాతన బోధనల సారం ఇప్పటికి విస్మయం కలిగిస్తుంది, గో మాంసం తిననివారు ఎన్నటికి నిజమైన హిందువు కానేరడు.——-( వివేకానంద:- ది కంప్లీట్ వర్క్స్ అఫ్ వివేకానంద, వాల్యూం నెంబర్ 3 పేజి 356 )