నగరంలోని రెస్టారెంట్లో మటన్‌కు బదులు ఎద్దు మాంసం - MicTv.in - Telugu News
mictv telugu

నగరంలోని రెస్టారెంట్లో మటన్‌కు బదులు ఎద్దు మాంసం

October 16, 2018

రెస్టారెంట్లలో ఎక్కువగా తినేవారికి హెచ్చరిక. మీరు ఆర్డర్ చేసిన ఆహారమే వచ్చింద లేదో ఒకసారి చూసుకుని తినండి. ఎందుకంటే? హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో మటన్‌కు బదులుగా బీఫ్ వడ్డించారు. ఆ వ్యక్తికి అనుమానం వచ్చి రెస్టారెంట్ నిర్వహకులను నిలదీయగా అసలు విషయం బయటకు వచ్చింది.Beef meat being sold as mutton in Restaurant Hyderabad Banjarahills road no 12కూకట్‌పల్లి శంషీగూడకు చెందిన కేవీ. సురేశ్ వృత్తిరీత్య డాక్టర్. తన స్నేహితులైన ఐపీఎస్ అధికారి శ్యామ్‌సుందర్, ఐఆర్‌ఎస్ అధికారి విజయ్‌కుమార్, ఏపీ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సుర్జీత్‌సింగ్‌తో కలిసి అక్టోబర్ 8న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. మటన్ ఆర్డర్ చేసి తింటుడగా.. అనుమానం వచ్చి వెంటనే రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించారు. దానికి వారు సమాధానం చెప్పకపోవడంతో ఆహారపదార్థాలను తీసుకుని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నమూనాలను ల్యాబ్‌కు పంపిన పోలీసులు, రెస్టారెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.