ట్రైనీ పోలీసుల మెనూలో బీఫ్ తొలగింపు.. - MicTv.in - Telugu News
mictv telugu

ట్రైనీ పోలీసుల మెనూలో బీఫ్ తొలగింపు..

February 17, 2020

Beef remove.

శిక్షణలో ఉన్న పోలీసులకు అందిస్తున్న బీఫ్‌ను మెనూ నుంచి తొలగించడంతో కేరళలో మళ్లీ వివాదం రేగింది. రాష్ట్ర పోలీస్ ట్రైనింగ్ అకాడెమీలో పెడుతున్న భోజనంలో ఇతర మాంసాహారాలను అలాగే ఉంచి కేవలం గొడ్డుమాంసాన్నే తొలగించడంతో ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 

అయితే బీఫ్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించలేదని, ప్రతి యేటా కొత్త బ్యాచులకు మెనూలో మార్పుచేర్పులు ఉంటాయని, ఈసారీ అదే జరిగిందని అధికారులు వివరణ ఇస్తున్నారు. ఇది తమ సొంత నిర్ణయం కాదని, ఆహార నిపుణుల ప్రతిపాదన ప్రకారమే మెనూ ఉంటుందని అంటున్నారు. గతంలో అకాడెమీలో వారానికి రెండుసార్లు బీఫ్ పెట్టేవారు. అయితే 2015లో నాటి ఐటీ సురేశ్ రాజపురోహిత్ ఆదేశాలతో దీన్ని తీసేశారు. తర్వాత వచ్చిన వామపక్ష ప్రభుత్వం దీన్ని పునరుద్ధరించింది. కాగా, మెస్ చార్జీలను రూ. 2 వేల నుంచి రూ. 6 వేలకు పెంచడం కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే పోలీసులకు ఎక్కువ శక్తి కావాల్సి వస్తుందని కనుక అధిక కేలరీలో భోజనం పెట్టేందుకు చార్జీలను పెంచామని అధికారులు చెబుతున్నారు.