వీళ్లు మారారు...ఆఘోరక్షకులు..! - MicTv.in - Telugu News
mictv telugu

వీళ్లు మారారు…ఆఘోరక్షకులు..!

July 13, 2017

ఓవర్ యాక్షన్ చేస్తే తాట తీస్తామని ప్రధాని మోదీ సైతం హెచ్చరించినా గో రక్షక్ కార్యకర్తలు మారడం లేదు. ఇంకా చెలరేగిపోతూనే ఉన్నారు. గోవుల్ని, గో మాంసాన్ని తీసుకెళ్తున్నారని అరాచకాలకు దిగుతున్నారు. నాగ్ పూర్ లో గోమాంసం తీసుకెళ్తున్నాడ‌ని ఓ వ్య‌క్తి ని చిత‌క‌బాదారు గో ర‌క్ష‌క సిబ్బంది. భర్సింగి లో ఈ ఘ‌ట‌న జరిగింది. ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రధాని సైతం వార్నింగ్ ఇచ్చినా గోరక్షక సిబ్బంది వినడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.