రాజస్తాన్‌లో ఏపీ పోలీసుల ఎన్‌కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

రాజస్తాన్‌లో ఏపీ పోలీసుల ఎన్‌కౌంటర్

October 27, 2017

మోస్ట్ వాంటెడ్ గజదొంగ  బీమసింగ్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్  పోలీసులు రాజస్తాన్‌లో కాల్చి చంపారు . కర్నూలు జిల్లా  డోన్  దగ్గర  గత నెలలో ఐదు కోట్లు  దోచుకున్న కేసులో భీంసింగ్  నిందితుడు.

తర్వాత రాజస్తాన్ పారిపోయాడు. కర్నూలు  పోలీసులు అతడు  రాజస్తాన్  ఉన్నట్టు తెలుసుకుని అక్కడికెళ్లారు.  భీంసింగ్ దొరికినట్టే దొరికి  కారులో పారిపోతూ.. ఎదురు కాల్పులు జరుపుతూ పారిపోయాడని, దీంతో అతణ్ని కాల్చి చంపామని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన  రాజస్తాన్‌లోని జాలోర్  జిల్లాలో జరిగింది .ఈ కాల్పుల్లో  భీంసింగ్‌తో పాటు కారు డ్రైవర్ చనిపోయాడు .బీంసింగ్  పేరుమోసిన దారిదోపిడి దొంగని,  సుమారు 55 కేసుల్లో  నిందితుడని  పోలీసులు తెలిపారు .