తెలంగాణలో బీరు, క్వార్ట‌ర్ ధర పెంపు.. ఏకంగా రూ. 170 - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో బీరు, క్వార్ట‌ర్ ధర పెంపు.. ఏకంగా రూ. 170

May 19, 2022

తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులకు మరో షాక్ తగిలింది. మద్యం ధరలను పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. బీరుపై రూ.20, క్వార్ట‌ర్‌పై రూ.20 పెంచుతూ తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

”ఒక్కో బీరుపై రూ.20 పెంచాం. ప్రభుత్వ బ్రాండ్‌తో సంబంధం లేకుండా ఒక్కో క్వార్ట‌ర్‌పై రూ.20 పెంచాం. ఇక బ్రాండ్‌తో సంబంధం లేకుండా ప్ర‌తి హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80 పెంచాం. బుధ‌వారం రాత్రే ఈ నిర్ణయం తీసకున్నాం. పెంచిన ధ‌ర‌లు గురువారం నుంచే అమ‌ల్లోకి వస్తాయి”.

ప్రస్తుతం లైట్‌ బీర్‌ ధర రూ.140 ఉండగా దాన్ని ధర రూ.160, స్ట్రాంగ్‌ బీర్‌ ధర రూ.150 ఉండగా, దాన్ని రూ.170కి పెరిగింది. గతకొన్ని రోజలుగా అబ్కారీ శాఖ గణాంకాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో బీర్లు విక్రయాలు భారీగా పెరిగాయని, ఎక్కువగా హైదరాబాద్‌లోనే మందుబాబులు బీర్లను తెగ తాగేస్తున్నారని అధికారులు వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీరు, క్యార్టర్ ధరలను పెంచడంతో మందుబాబులు అయోమయంలో పడ్డారు.