బీర్ల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో.. బాటిళ్లన్ని రోడ్డుపై పడ్డాయి. వీటి కోసం జనం ఎగబడ్డారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కలికివాయి సమీపంలో జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో బీరు బాటిళ్లు ఉన్న లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో స్థానికులు ఆ లారీ పరిస్థితి, అందులో ఉన్న వ్యక్తుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా.. బీరు బాటిళ్ల కోసం ఎగబడ్డారు.
రోడ్డుపై పడ్డ బీరు బాటిల్స్ దొరికినోడికి దొరికినన్ని ఎత్తుకెళ్లారు. ఒక్కొక్కరు పదుల సంఖ్యలో బీరు బాటిళ్లను దోచేశారు. శ్రీకాకుళం నుంచి మదనపల్లికి బీరు లోడుతో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.