హైదరాబాద్‌లో బీరు జోరు.. నెం.1 స్థానంలో - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో బీరు జోరు.. నెం.1 స్థానంలో

May 17, 2022

 

 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మందుబాబులు, యువకులు బీర్లను జోరుగా తాగుతున్నారని మద్యం షాపుల యాజమానులు తెలిపారు. విందులకు, వినోదాలకు, పుట్టిన రోజులకు, పెళ్లిల సందర్భంగా బీర్ల విక్రయాలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. ఓవైపు ఎండలు, మరోవైపు ఉక్కబోత రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ క్రమంలో మందుబాబులు బీర్లను ఎక్కువగా తాగుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో బీరు హవానే నడుస్తోందని అబ్కారీశాఖ అధికారులు తెలిపారు.

అబ్కారీశాఖ గణాంకాల ప్రకారం..”జనవరి-మే 15వ తేదీ వరకు జరిగిన మద్యం విక్రయాల్లో సగానికి పైగా వాటా బీర్లదే. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మద్యం విక్రయాల్లో రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉంది. ఈ ఏడాది మే 15 వరకూ రంగారెడ్డిలో 4,88,56,840, హైదరాబాద్‌లో 1,74,20,700, మేడ్చల్ జిల్లాలో 97,16,424 బీర్లు తాగారు”.