తెలంగాణలో బీర్ల ధర 12 శాతం పెంపు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో బీర్ల ధర 12 శాతం పెంపు

April 10, 2018

ఎండాకాలం వచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బీర్ల ధరలను 12 శాతం పెంచాలని సూత్రప్రాయంగా  నిర్ణయించింది. సంబంధిత ఫైలు సీఎం కేసీఆర్ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. మద్యం ధరలను పెంచి కొన్నాళ్లు కూడా కాకముందే మళ్లీ వడ్డింపు మొదలుపెట్టింది. బీర్ల ధరలను పెంచి రూ.30 కోట్లు, ఏడాదికి రూ.300 కోట్లు అదనంగా ఆదాయం సంపాదించుకోవాలన్నది సర్కారు ఎత్తుగడ. టీఎస్‌బీసీఎల్ లెక్కల ప్రాకారం.. రాష్ట్రంలో రోజుకు 8 లక్షల మంది 13 లక్షల బీర్లు కూల్ కూల్‌గా తాగుతున్నాయి.నాలుగేళ్లుగా పెంచలేదని..

తెలంగాణలో నాలుగేళ్లుగా బీర్ల ధరలు పెంచలేదని, ఈసారి పెంచి తీరాల్సిందేని బ్రూవరీ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. సీసాపై రూ.6 చొప్పున బేసిక్ ధరపై 20 శాతం అదనంగా ఇవ్వాలని కోరుతున్నాయి. వీటి డిమాండ్ల పరిశీలకు నియమించిన జస్టిస్ గోపాల్‌రెడ్డి కమిటీ 12 శాతం ధరలు పెంచుకోవచ్చని సూచించింది. మద్యం అమ్మకాలతో సర్కారుకు గత ఏడాది రూ.15 వేల కోట్ల ఆదాయం వచ్చింది.