befits of eating apple
mictv telugu

లేవగానే ఆపిల్ తింటే ఉపయోగాలెన్నో…

November 19, 2022

befits of eating apple

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన పనే లేదనేది బాగా పాతుకుపోయిన నానుడి.ఒకప్పుడు ఆపిల్ చాలా ఖరీదైన పండు. కానీ ఇప్పుడు అలా కాదు. అన్ని దేశాల్లో ఆపిల్ చాలా ఈజీగా, అందరూ తినే ధరల్లోనే దొరుకుతోంది. ఇందులో చాలా రకాలు కూడా ఉన్నాయి. మన టేస్ట్ కు తగ్గట్టు ఆపిల్స్ లో రకాలు కూడా వచ్చేసాయి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే యాపిల్‌లో ఐరన్, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు యాపిల్స్‌లో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. అందుకే ఉదయాన్నే ఆపిల్ తినడం వల్ల రోజంతా శరీరానికి శక్తి లభిస్తుంది అని చెబుతున్నారు డాక్టర్లు.

ఆపిల్స్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆపిల్‌ను ఖాళీ కడుపుతో తింటే అన్ని పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. శరీరంలోని అవసరమైన పోషకాల కొరత తీరుతుంది. అయితే మీడియం సైజు యాపిల్స్‌లో పొటాషియం, విటమిన్ సి కూడా ఉంటాయి. అలాగే బరువును నియంత్రించుకోవాలనుకుంటే ఉదయం ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం మంచిది. రోజూ ఉదయం ఒక ఆపిల్ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. దీనిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో మీరు క్రమంగా బరువు తగ్గుతారు.

సరే ఉదయం పూట తినడం అవ్వడం లేదు. కనీసం రోజూ కూడా తినడం లేదు. అయినా పర్వాలేదు కానీ వీలైనప్పుడల్లా, వారానికి కనీసం నాలుగు యాపిల్సైనా తింటే ఎన్నో రకాల ప్రయోజనాల్ని పొందవచ్చు. ముఖ్యంగా కేన్సర్ లాంటి రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.యాపిల్‌ మెదడును చురుగ్గా మార్చేస్తుంది. మతిమరపుకి కారణమయ్యే అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తూ, మెదడుకి రక్షణనిస్తుంది. అంతేకాదు నరాలపై ప్రభావం చూపే, పార్కిన్‌సన్స్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.కంటి చూపును కాపాడుతుంది. కాటరాక్ట్స్, గ్లకోమా వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. కంటి చూపును మెరుగుపరచి, రేచీకటి రాకుండా చేస్తుంది. ఈ పండులోని ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ ఫైటోన్యూట్రియంట్స్ సూక్ష్మజీవుల నుంచీ కళ్ల హాని జరగకుండా కాపాడతాయి.

ముఖ్యంగా ఆపిల్ ఆడవాళ్ళకు ఆపిల్ చాలా మంచిదట.దీనిలో ట్రైటెర్పినాయిడ్స్‌ అనే పోషకాలు… కాలేయ కేన్సర్, పెద్ద పేగు కేన్సర్, రొమ్ము కేన్సర్‌లను నివారిస్తాయని కార్నెల్‌ యూనివర్శిటీ చేసిన పరిశోధనలో తేలింది.యాపిల్‌లో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. అందువల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగయ్యి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యాపిల్‌ మంచి డీ–టాక్సిఫైయింగ్‌ ఏజెంట్‌ కూడా. ఇది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన కాలేయంలోని విషాల్ని విజయవంతంగా తొలగిస్తుంది.

ఇక వయసుకు, అందానికి సంబంధించి కూడా ఆపిల్ ఎంతో సహాయం చేస్తుంది అంటున్నారు. యాపిల్ త్వరగా ముసలితనం రాకుండా కాపాడుతుంది. ఇందులోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్ మన చర్మ కణాల్ని కాపాడతాయి. ముడతలు, మచ్చల వంటివి రాకుండా చేస్తాయి. చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారేలా యాపిల్ చేస్తుంది. మృత కణాల్ని తొలగించడమే కాదు. పాడైన కణాల్ని సరిచేస్తుంది కూడా. ఈ గుజ్జులో తేనెను కలిపి చర్మానికి పట్టిస్తే, యవ్వన ఛాయలతో మెరిసే స్కిన్ పొందొచ్చుట.

అదండీ సంగతి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే, రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదంటున్నారు పరిశోధకులు. ఇవి మనకు ఏడాదంతా దొరుకుతాయి కాబట్టి, ప్రణాళికా బద్ధంకా తింటూ ఉంటే, మనకు తెలియకుండానే చాలా రకాల రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. కాబట్టి మీరు కూడా తరుచు ఆపిల్ తినడం అలవాటు చేసుకోండి. అందంగా, ఆరోగ్యంగా ఉండండి.