Before becoming a hero..did that too: Vijay
mictv telugu

హీరో కాకముందు..ఆ పని కూడా చేశా: విజయ్

August 16, 2022

‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ‘అర్జున్ రెడ్డి’, ‘గీతగోవిందం’ వంటి సినిమాలతో భారీ హిట్టు కొట్టి, ప్రస్తుతం ‘లైగర్’ సినిమాతో యావత్ భారతదేశాన్ని షేక్ చేయడానికి సిద్దమైన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ హీరోకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవరకొండ సినిమాల్లోకి రాకముందు ఏఏ పనులు చేశాడు? ఎవరెవరినీ కలిశాడు? అనే విషయంపై నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు.

అయితే, ఈ విషయాల గురించి తాజాగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ‘ఒక్కరోజులోనే నాకు ఇంతటి స్థాయి దక్కలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఎంతో కష్టపడి ఈ రేంజ్‌కు చేరుకున్నా. తొలి నాళ్లలో చిన్న పాత్రలను కూడా చేశా. ఎక్కువగా నెగెటివ్ రోల్స్‌లో నటించా. నటుడు కాకముందు…సినీ పరిశ్రమలో పరిచయాలు పెంచుకునేందుకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. దర్శకుడు తేజ వద్ద అసిస్టెంట్‌గా పని చేశా. పూరి జగన్నాథ్ అయితే జీతం ఎక్కువ ఇస్తారని, ఆయన వద్దకు వెళ్లాలని మా నాన్న చెప్పారు. దాంతో పూరి జగన్నాథ్ ఆఫీసుకు వెళ్లాను. కానీ ఆయనను కలవడం కుదరలేదు. ‘డియర్ కామ్రేడ్’ సినిమా తర్వాత ఆయనను కలవడం జరిగింది. ఇప్పుడు ఆయనతో ‘లైగర్’ సినిమా చేశా’ అని అన్నాడు.

మరోపక్క ఈ నెల 25న ‘లైగర్’ చిత్రం విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో విడుదలైన ఈ చిత్రం పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల మదిని దోచేస్తున్నాయి. అంతేకాదు, ఈ మధ్య కాలంలో హీరో విజయ్ ఇస్తున్న స్పీచ్‌లను వింటుంటే సినిమాపై మరింత ఆశలు పెరుగుతున్నాయని విజయ్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.