ప్రియాంక కేసు మరిచిపోకముందే శంషాబాద్‌లో మరో దారుణం.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంక కేసు మరిచిపోకముందే శంషాబాద్‌లో మరో దారుణం..

November 29, 2019

Before Priyanka's.

పశు వైద్యాధికారిణి ప్రియాంక రెడ్డి హత్యాచారం గురించి మరిచిపోకముందే శంషాబాద్‌లో మరో దారుణం వెలుగుచూసింది. శంషాబాద్‌లో వరుస హత్యలు పోలీసులను కలవరానికి గురిచేస్తున్నాయి. ప్రియాంక రెడ్డి హత్య జరిగి 48 గంటలు గడవక ముందే సిద్దుల గుట్టలోని అయ్యప్ప గుడి సమీపంలో మరో మహిళను(35) అత్యంత దారుణంగా తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రియాంక హత్య కేసులో నిందితులను పట్టుకున్న 40 నిమిషాల్లోనే మరో మహిళ దారుణహత్యకు గురి అవడం కలకలం రేపుతోంది. అయితే హత్యకు గురైన మహిళ ఎవరు ఏంది అన్నది ప్రస్తుతానికి తెలియలేదు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమకు రాత్రి 9 గంటలకు సమాచారం అందిందని చెప్పారు. ఇక్కడ సమీపంలో సినిమా షూటింగ్ చేసుకుంటున్నవారు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారని.. సంఘటనా స్థలానికి వెళ్లేసరికి శవం కాలుతోందని చెప్పారు. ప్రియాంక రెడ్డి హత్య జరిగిన చోటు నుంచి ప్రస్తుత మహిళ హత్య జరిగిన చోటుకు ఒక కిలోమీటర్ దూరమే ఉందని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని.. నిందుతులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.