beggar achieved Government teacher job in andhra pradesh
mictv telugu

ఏపీ : బిచ్చగాడికి ప్రభుత్వ టీచరు ఉద్యోగం.. అదీ 55 ఏళ్ల వయసులో

June 20, 2022

beggar achieved Government teacher job in andhra pradesh

ఈ వార్త ప్రస్తుతం ఏపీలో వైరల్ అవుతోంది. 1998 డీఎస్సీలో సెలెక్ట్ అయిన వారికి ప్రభుత్వం తాజాగా ఉద్యోగాలు ఇవ్వనుండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు పరీక్ష రాసిన శ్రీకాకుళం పాతపట్నానికి చెందిన అభ్యర్ధి, ఇప్పుడు వీధులు తిరుగుతూ బిచ్చం ఎత్తుకుంటున్నాడు. ఉద్యోగం వచ్చిన విషయం చెబితే.. ఉద్యోగం జీవిత కాలం లేటు అంటూ నిట్టూరుస్తున్నాడు. పూర్తి వివరాల్లోకెళితే.. సీది గ్రామానికి చెందిన కేదారేశ్వరరావు 1994లో మొదట డీఎస్సీ రాసి స్వల్ప తేడాతో ఉద్యోగం కోల్పోయారు. తర్వాత 1998లో మళ్లీ డీఎస్సీ రాయగా, వివాదాలతో నిలిచిపోయింది.

దీంతో ఉద్యోగం రాదని భావించి కుల వ‌ృత్తి అయిన చేనేత వస్త్రాలను సైకిళ్లపై అమ్మడం చేశాడు. తర్వాత అదీ కలిసిరాకపోవడంతో చివరకి భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడు. తల్లిదండ్రులు ముసలివారై చనిపోగా, ఇద్దరు సోదరులు కేదారేశ్వరరావు మానసిక స్థితి చూసి వదిలేశారు. తాజాగా ప్రభుత్వం క్వాలిఫై జాబితాను వెల్లడించగా, కొందరు యువకులు ఈ విషయాన్ని కేదారేశ్వరరావుకు తెలియజేయగా, తనకు ఈ విషయం తెలియదని, 23 ఏళ్లయింది కాబట్టి మర్చిపోయానని తెలిపాడు. మరి ఇప్పుడు మానసిక స్థితి సరిగా లేని కేదారేశ్వరరావును ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాలి. కాగా, కేదారేశ్వరరావు ప్రస్తుత వయస్సు 55 ఏళ్లు కావడం గమనార్హం.