భార్యపై ప్రేమతో రూ.90 వేల బైక్ కొన్న బిచ్చగాడు - MicTv.in - Telugu News
mictv telugu

భార్యపై ప్రేమతో రూ.90 వేల బైక్ కొన్న బిచ్చగాడు

May 23, 2022

భార్యపై ఉన్న ప్రేమతో మోపెడ్‌ను కొనుగోలు చేశాడో బిచ్చగాడు. తన కారణంగా ఇబ్బందులు పడుతున్న భార్య బాధను చూడలేక రూ.90 వేలు విలువ చేసే ఎలక్ట్రిక్ వాహనాన్ని కొన్నాడు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని అమరవార గ్రామంలో సంతోష్ సాహు అనే వ్యక్తి వీధుల్లో అడుక్కుంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే అంగవైకల్యం కారణంగా తాను ట్రై సైకిల్‌పై కూర్చుంటే.. తన భార్య దానిని నెడుతుండేది. ట్రై సైకిల్‌ను తోయడానికి తన భార్య ఎంతో ఇబ్బంది పడుతుండేది. ఈ క్రమంలో ఆమె అప్పుడప్పుడూ జబ్బు పడుతూ ఉండేది.

భార్య ఇబ్బందులను అర్థం చేసుకున్న సంతోష్ సాహు.. ఓ బైక్ కొని ఆమెకు గిఫ్ట్‌గా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం గత 4 సంవత్సరాలుగా ఒక్కొక్క రూపాయి కూడబెడుతూ.. తాజాగా రూ.90వేలతో మోపెడ్‌ను కొనుగోలు చేశాడు. దీంతో అతడి భార్య సంతోషం వ్యక్తం చేసింది. ఆమె ముఖంలోని చిరునవ్వు చూసి.. సంతోష్ సాహూ కళ్లు వెలిగిపోయాయి. ప్రస్తుతం సంతోష్ సాహూ అతడి భార్య మోపెడ్‌పై పలు ప్రాంతాలకు ప్రయాణిస్తూ భిక్షాటన చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.