Begging ban in Karnataka state
mictv telugu

రాష్ట్రంలో అడుక్కోకుండా నిషేధం.. నేరస్తులవుతారట..

July 20, 2022

Begging ban in Karnataka state

ఆత్మాభిమానం చంపుకుని చేయి చాపాలని ఎవరికీ ఉండదు. విధిలేని పరిస్థితుల్లోనే చాలా మంది భిక్షాటన చేస్తుంటారు. కొందరు స్వార్థపరులు ఈ ‘రంగం’పైనా కన్నేసి ఘోరాలకు పాల్పడుతున్నారు. అనాథ పిల్లల కాళ్లు చేతులు విరిచేసి వారితో భిక్షాటన చేయిస్తూ ఆ డబ్బును గుంజుకుంటున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ముఠాలున్నాయి. కర్ణాటకలో మరీ ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భిక్షాటనపై సంపూర్ణ నిషేధాన్ని అమల్లోకి తెస్తున్నామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కోట శ్రీనివాసపూజారి ప్రకటించారు.

‘కొందరు పిల్లలను దివ్యాంగులుగా మార్చి భిక్షాటన చేయిస్తున్నారు. ఫలితంగా బాలనేరస్తులు తయారవుతున్నారు. బెంగళూరులో మరీ ఎక్కువగా 720 మంది పిల్లలు అడుక్కుంటున్నారు. 101 మంది బాలలను కాపాడి పునరావాసం కల్పించాం. ఎవరైనా సాయం కావాలంటే 1098 నెంబరుకు ఫోన్ చేస్తే కాపాడతాం. బాల యాచకుల సమాచారాన్ని పోలీసులకు ఇచ్చి సహకరించాలి’ అని ఆయన పౌరులను కోరారు.