బేగంపేట స్టేషన్‌ మూసివేత..ఆగని మెట్రో రైళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

బేగంపేట స్టేషన్‌ మూసివేత..ఆగని మెట్రో రైళ్లు

October 21, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరింది. కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ ముట్టడిని భగ్నం చేయడం కోసం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బేగంపేట, సికింద్రాబాద్ మధ్య ప్రయాణిస్తోన్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. 

Begumpet metro station.

దీంతో సికింద్రాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రగతి భవన్‌కు సమీపంలోని బేగంపేట మెట్రో స్టేషన్‌ను కూడా మూసివేశారు. దీంతో సోమవారం ఇక్కడ మెట్రో రైళ్లు ఆగడం లేదు. ఒక వైపు ఆర్టీసీ సమ్మె.. మరో వైపు ఈరోజు నుండే విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం. దీంతో ఉదయం నుండి మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో బేగంపేట స్టేషన్‌కు వచ్చిన ప్రయాణీకులు స్టేషన్‌కు తాళం వేసి ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.