ఎవరైనా తమకు సంబంధించిన వేడుకలను, ఫంక్షన్లను నిర్వహించానుకుంటే పెద్ద ఫంక్షన్ హాళ్లలోనో, ఫాం హౌస్ లలో ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఓ తండ్రి మాత్రం తన కూతురి పుట్టిన రోజు వేడుకల కోసం ఏకంగా అసెంబ్లీనే అద్దెకు అడిగారు. అనుమతుల కోసం అసెంబ్లీ స్పీకర్, జిల్లా కలెక్టర్ కి లేఖ రాశారు.
దీంతో ఈ లెటర్ చర్చనీయాంశమవుతోంది. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెళగావి జిల్లా ఘటప్రభ గ్రామానికి చెందిన లాయర్ మల్లికార్జున చౌకశీ ఈ లేఖ రాశారు. తన ఒక్కగానొక్క కూతురు మణిశ్రీ ఐదో పుట్టినరోజును ప్రత్యేకంగా జరపాలనుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు. ‘జనవరి 30న మణిశ్రీకి ఐదేళ్లు పూర్తవుతాయి. తర్వాత ఒకటో తరగతిలో ప్రవేశించబోతోంది. ఈ క్షణాలు ఆమె జీవితంలో అమూల్యమైనవి. అందుకే పుట్టినరోజు వేడుకలను జరుపుకునేందుకు సువర్ణసౌధను ఒకరోజు అద్దెకు ఇవ్వాలని అభ్యర్ధిస్తున్నాను’ అంటూ లేఖ రాశాడు. అంతేకాక, సువర్ణ సౌధలో కేవలం శీతాకాల సమావేశాలను మాత్రమే నిర్వహిస్తున్నారని, తర్వాత ఖాళీగా ఉంటుంది కాబట్టి అద్దెకు ఇస్తే నిర్వహణ ఖర్చులను ఉపయోగపడుతుందని, తన లేఖపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరాడు. కాగా, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండే బెళగావిలో ఈ సువర్ణ సౌధ ఉంది. నాలుగంతస్థుల నిర్మాణంతో 300 మంది కూర్చునే సౌకర్యం ఉంది. 14 సమావేశ మందిరాలతో మొత్తం 60,398 చ.మీటర్లు వైశాల్యంతో ఉంది. కాగా, ఈ బెళగావి ప్రాంతం కోసం కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతం మాదంటే మాదని ఇరు రాష్ట్రాలు వాదించుకుంటున్నాయి.
వైరల్ వార్తలు చదవండి :
దేవుళ్లకు చలి..స్వెటర్స్ వేసిన భక్తులు..వారణాసిలో వింత ఆచారం
అందరీ ‘కళ్లు’ వాళ్ల వైపునకు తిప్పుకున్నారు!