కరోనా బామ్మ బలిదానం.. వెంటిటేర్  నాకెందుకు, పిల్లలకు పెట్టండి..   - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా బామ్మ బలిదానం.. వెంటిటేర్  నాకెందుకు, పిల్లలకు పెట్టండి..  

April 1, 2020

Belgian woman, 90, with coronavirus passes away after telling doctors to save ventilator for younger patients

కరోనా వైరస్ ప్రభావానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ సోకి దాదాపు 43వేల మంది మరణించారు. ఇటలీ, స్పెయిన్ ఇంగ్లాండ్, బెల్జియం మొదలగు దేశాల్లో కరోనా కేసులు వేగంగా ఎక్కువవుతున్నాయి. దీంతో ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఓ 90 ఏళ్ళ బామ్మ అపూర్వమైన త్యాగం చేశారు. 

బెల్జియంకు చెందిన సుజాన్ హోయలార్ట్స్(90) కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆమెకు వెంటిలేటర్ అమర్చేందుకు వైద్యులు సిద్ధపడ్డారు. అయితే తనకు వెంటిలేటర్ ఉపయోగించడం ఇష్టం లేదనీ, ఇప్పటికే చాలా జీవితాన్ని గడిపాను కనుక తనకు ఉపయోగించే ఆ పరికరాన్ని వేరే ఎవరైనా చిన్న వయసున్న రోగులకు ఉపయోగించాలని వైద్యులను కోరారు. ఆ తరువాత కొన్ని రోజులకే ఆమె కన్నుమూశారు. దీంతో ఆమె త్యాగం మరువలేనిదంటూ ఆమెకు చికిత్స డాక్టర్లు సహా పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.